ప్రజలపై ఉల్లి ధరల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబజార్లలో కేజీ 40 రూపాయలకు ఉల్లిని విక్రయిస్తుండగా.. ఏపీ ప్రభుత్వం 25 రూపాయలకే ప్రజలకు పంపిణీ చేస్తోందని తెలిపారు. మరో 10 రోజుల్లో ఈజిప్టు, టర్కీ ఉల్లిపాయలు రాష్ట్రానికి రానున్నాయని అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2450 మెట్రిక్ టన్నుల ఉల్లి డిమాండ్ ఉన్నట్లు కేంద్రానికి చెప్పామన్నారు. ఉల్లి అక్రమంగా నిల్వచేయడం, అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేసి... దాడులు నిర్వహించామని మంత్రి తెలిపారు.
రాష్ట్రానికి ఈజిప్టు, టర్కీ ఉల్లిపాయలు..! - మంత్రి మోపిదేవి వెంకటరమణ వార్తలు
మరికొన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు ఉల్లి కష్టాలు తప్పవని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లి మరో 10 రోజుల్లో రాష్ట్రానికి వస్తుందని తెలిపారు.
ఉల్లిపాయలు