ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సైకిల్​ విషయంలో వివాదం.. బ్యాటుతో తలపై కొట్టడంతో...! - కాకినాడ జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన స్వల్ప వివాదం... కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోలివారి కొత్తూరులో విషాదాన్ని నింపింది. సైకిల్​ విషయంలో తలెత్తిన గొడవలో క్రికెట్​ బ్యాటుతో తలపై కొట్టడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..?

One dead in clash between students
క్రికెట్​లో వివాదం... ఒకరు మృతి

By

Published : Apr 26, 2022, 7:07 PM IST

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గోలివారి కొత్తూరులో విషాదం నెలకొది. మేడపాడు జిల్లా పరిషత్ హైస్కూల్​లో​ చదివే సూర్య, పండు.. ఒంటిపూట బడులు కావడంతో గ్రామ శివార్లలోని క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో సైకిల్ విషయంలో బాలురు సూర్య, పండులు ఘర్షణ పడ్డారు. కింద పడిన సైకిల్ సూర్య.. పైకి తీస్తుండగా పండు బ్యాటు తీసుకుని తలపై కొట్టాడు. అతను కిందపడిపోవడంతో లేపి మంచినీరు తాగించి విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఇంటికెళ్లిన సూర్య తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. ఎంతసేపటికీ అతను లేవకపోవడంతో తెల్లవారు జామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సూర్య తల్లిదండ్రులు హైదరాబాద్​లో పని చేస్తూ ఇక్కడ అమ్మమ్మ ఇంట్లో ఉంచి చదివిస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details