తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణం ఇంద్రపాలెంలో వేంచేసి ఉన్న మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు నాగాభరణం బహుకరించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. కాకినాడకు చెందిన ప్రముఖ నగల దుకాణం వ్యాపారి మహేంద్ర కుమార్ సుమారు రూ. 1.30 లక్షలు విలువ చేసే వెండి నాగాభరణం స్వామివారికి అందించినట్లు ఈవో చెప్పారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సూరంపూడి మాధవ్, అర్చకులు దత్తు మాధవ తదితరులు పాల్గొన్నారు.