ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం'

ఆక్వా రంగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రులు మోపిదేవి, కన్నబాబు చెప్పారు. కరోనా ప్రభావంతో ధరల్లో తేడాలు ఉంటే 1902, 1907 నెంబర్లకు రైతులు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

ministers-review-on-aqua-sector-problems-in-state
ministers-review-on-aqua-sector-problems-in-state

By

Published : Apr 7, 2020, 7:14 PM IST

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి మోపిదేవి

రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర దక్కే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కన్నబాబు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించారు. ఆక్వా ఎగుమతుల్లో వస్తున్న విదేశీ మారకద్రవ్యం.. దేశంలో 50 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉందని మోపిదేవి చెప్పారు.

ప్రభుత్వం ఆక్వా సాగుకు గిట్టుబాటు ధర నిర్ణయించినా... కొందరు దళారీల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రైతులు స్వేచ్ఛగా అమ్మకాలు సాగించేలా కలెక్టర్‌, ఎస్పీలు దృష్టి సారించాలని మంత్రి మోపిదేవి సూచించారు. రాష్ట్రంలో తొలిసారిగా గ్రామస్థాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కన్నబాబు చెప్పారు. కరోనా ప్రభావంతో ధరల్లో తేడాలు ఉంటే 1902, 1907 నెంబర్లకు రైతులు సమాచారం ఇవ్వొచ్చని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details