అమూల్(amul) కోసం ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటే తప్పేముందని మంత్రి కన్నబాబు(minister kannababu) అన్నారు. అమూల్ అనేది కార్పొరేట్ సంస్థ కాదని, అది కోపరేటివ్ ఫెడరేషన్(co-operative federation) అని తెలిపారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులపై సీఎం జగన్(CM jagan) నిర్వహించిన సమీక్ష(review)లో మంత్రి కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గ్రామాల్లో మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల(multi purpose fecilities centres) ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని... కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదన్నారు. నాణ్యమైన ఎరువులు ఇవ్వడమే ఆర్‌బీకేల లక్ష్యమని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఎరువుల ఉత్పత్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 27 చోట్ల ఆహారశుద్ధి కేంద్రాలు(food processing units) ఏర్పాటు చేశామన్న మంత్రి.. నూజివీడు, అరకులోనూ ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను స్థాపిస్తామని వెల్లడించారు.