తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించింది. లలితాదేవి, దివాకర్ ప్రసాద్‌లు 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అత్తింటి వారు తమ భర్తకు రావాల్సిన ఆస్తిని తమ ఆడపడుచుకు రాసి...రోడ్డున పడేశారని బాధితురాలు వాపోయింది. న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపింది. ఇంతలోనే తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగి బలవన్మరణానికి యత్నంచింది. ఆమెను వెంటనే కటుంబ సభ్యులు, పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు.
కాకినాడ కలెక్టరేట్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం - కాకినాడలో వివాహిత ఆత్మహత్య తాజా వార్త
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఓ వివాహిత బలవన్మరణానికి యత్నించింది. అత్తింటి వారు భర్తకు రావాల్సిన ఆస్తిని .. ఆడపడుచుకు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపింది.
Married women suicide attempt in front of Kakinada Collectorate