ఉపాధ్యాయులు గొప్ప వనరని, వారిని సద్వినియోగం చేసుకోవాలంటే పాఠశాలల విలీనం అవసరమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. అయితే దీనిని సరిగ్గా అమలు చేస్తేనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. విలీనంతో పాఠశాల దూరాభారమైతే బడి నిర్వహణ ఖర్చును రవాణాపై పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో సగటున 16 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు కాగితాలపై చూపిస్తున్నారని తెలిపారు. అయితే 300 మంది పిల్లలున్న చోట్ల ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులున్న బడుల్నీ చూశానని చెప్పారు. అందువల్ల పాఠశాలల విలీనం సక్రమంగా జరగాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆదివారం కాకినాడలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.
Schools Merging: సౌకర్యాలు సమకూరిస్తే విలీనం మంచిదే: జేపీ
రాష్ట్రంలో పాఠశాలల విలీనంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. బడుల్లో సౌకర్యాలు సమకూరిస్తే విలీనం మంచిదే అని ఆయన అన్నారు. విలీనంతో పాఠశాల దూరాభారమైతే బడి నిర్వహణ ఖర్చును రవాణాపై పెట్టాలని సూచించారు. అయితే దీనిని సరిగ్గా అమలు చేయగలగాలని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పాఠశాల విద్యకు ఒక్కో విద్యార్థిపై రూ.91వేలు ఖర్చు చేస్తున్నా.. విద్యా ప్రమాణాలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుందని తెలిసిందని, విద్యా ప్రమాణాలు పెంచాలనే ఈ ఆలోచనను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. అమ్మఒడికి వెచ్చించే రూ.9వేల కోట్ల స్థానంలో రూ.9 కోట్లు ఖర్చు చేస్తే కొత్త సాంకేతికతతో విద్యా ప్రమాణాలు పెంచవచ్చని చెప్పారు. వరదలు రాకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. రూ.వేల కోట్ల నిరుత్పాదక ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చయ్యే కాలువల ఆధునికీకరణ చేపట్టకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: