‘కాకినాడలోని పులే పాకల కాలనీకి మున్సిపల్ కమిషనరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కాలనీగా పేరు మారుస్తామన్నారు. పేరు మార్చవద్దని అఖిలపక్షాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంటే... వైకాపా ఎమ్మెల్యే అనుచరులు నాపై విచక్షణారహితంగా దాడిచేశారు’ అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పులే కాలనీ పరిరక్షణ కార్యాచరణ కమిటీ అఖిలపక్ష వేదిక కార్యదర్శి దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. గురువారం ఉదయం తన ఇంటికి ముసుగులతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి, రాడ్లతో దాడి చేశారని వాపోయారు.
Kakinada colony issue: కాకినాడలో రచ్చకెక్కిన పులే పాకల కాలనీ వివాదం
కాకినాడలోని పులే పాకల కాలనీ పేరు మార్పు అంశం వివాదంగా మారింది. పులే పాకల కాలనీకి మున్సిపల్ కమిషనరు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కాలనీగా పేరు మారుస్తామన్నారు. కాలనీ పేరు మార్చవద్దని అఖిలపక్షాలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం ఉదయం తన ఇంటికి ముసుగులతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి, రాడ్లతో దాడి చేశారని కాకినాడ పులే కాలనీ పరిరక్షణ కార్యాచరణ కమిటీ అఖిలపక్ష వేదిక కార్యదర్శి దూసర్లపూడి రమణరాజు వాపోయారు.
కాలనీపేరు మార్పుపై కాకినాడలో కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ... అఖిల పక్షాలు, బీసీ సంఘాల నేతలు గురువారం ఓ ఫంక్షన్ హాలులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అక్కడికి వైకాపా శ్రేణులు, పులే పాకల వాసులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని అందరినీ పంపించారు. దీంతో అఖిలపక్ష నాయకులు స్థానిక సుందరయ్య భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రమణరాజు తనపై జరిగిన దాడిలో తగిలిన గాయాలు చూపారు. ఒక కాలనీకి ప్రభుత్వ అధికారి పేరు పెడుతూ కౌన్సిల్‌లో తీర్మానం చేయడంపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. దాడిపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో రమణరాజు అస్వస్థతకు గురవడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించి, వైద్యం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై కాకినాడ డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ... గురువారం ఉదయం ఏడు గంటలకు జరిగిన దాడిలో వాస్తవం ఎంతో తెలియదని, దాడి జరిగితే వెంటనే డయల్ 100నుగానీ, పోలీస్‌స్టేషన్, డీఎస్పీ కార్యాలయాలనుగానీ ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్