కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు గృహ నిర్బంధం - ex mla house arrest in kakinada
చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో తెదేపా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గృహ నిర్బంధించారు. కొండబాబు నివాసానికి చేరుకున్న తెదేపా కార్యకర్తలు మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అప్పుడు పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం తలుపులు వేసి రాష్ట్రాన్ని విడగొట్టినట్లు... ఇప్పుడు అసెంబ్లీ ప్రసారాలు నిలిపివేసి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు గృహ నిర్బంధం