వైకాపా సర్కార్ చర్యలతో సంక్షోభంలోకి విద్యా వ్యవస్థ - అమ్మఒడి అమలు
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పెద్ద మోసమని తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. 'అమ్మఒడి పథకం' లబ్ధిదారుల సంఖ్యను సగానికిపైగా తగ్గించారని విమర్శించారు. ఈ పథకం వల్ల విద్యా వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో పడే అవకాశముందని చెప్పారు. దాదాపు ఆరు లక్షల మందికి పింఛన్లు నిలిచిపోయాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు కదల్లేదని విమర్శించిన జ్యోతుల.... విద్యార్థులపై నిజంగా ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఫీజుల బకాయిలు, ఉపకారవేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
jyothula nehru