కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ ఐకాస ఆందోళన
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ ఐకాస ఆందోళన - governament employes protest at East godavari
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్యోగుల సంఘం ఐకాస నేతలు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద చేసిన నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ ఐకాస ఆందోళన
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని రాష్ట్ర ఐకాస నేతలు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. 11వ వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతితో తమకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు.