ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2019, 7:13 AM IST

ETV Bharat / city

పిల్లల పండుగ..!

కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో జరిగిన అంతర్ పాఠశాలల సాంస్కృతికి పోటీలు ఘనంగా ముగిశాయి.

kriya fest

క్రియా పిల్లల పండుగ
నిత్యం పుస్తకాలతో కుస్తీలు పట్టే పిల్లలు... ఆటపాటల్లో మునిగి తేలారు. స్కూలు ..హోంవర్కు అని విసిగిన విద్యార్థులు... స్నేహితులతో కలసి ఉల్లాసంగా గడిపారు. క్లాసులో మాత్రమే ప్రతిభ కనబరచిన వారు...వందలాది మందిలో తమ మేథస్సుకు పనిచెప్పారు. ఇవన్నీ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో కనిపించిన...క్రియా పిల్లల పండుగలోని దృశ్యాలు.

క్రియా సంస్థ ఏటా నిర్వహించే రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీలు ఘనంగా ముగిశాయి. సుమారు 8వేల మంది విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. లఘనాటిక, శాస్తీయ నృత్యం, ఏక పాత్రాభినయం, చిత్రలేఖనం, వాద్య సంగీతం..ఇలా 27 అంశాల్లో విద్యార్థులు పోటీపడ్డారు.
విద్యతో సామాజిక అంశాలను స్పృశిస్తూ విద్యార్థులు లఘ నాటికలను ప్రదర్శించారు. అవయవ దానం ఎంత గొప్పదో ..తెలిపే విషయాన్ని బొమ్మల ద్వారా వివరించారు. భ్రూణ హత్యల ఖండన, ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాలు...ఇలా ఎన్నో ఉపయోగపడే అంశాలను వినూత్నంగా ప్రదర్శించారు.
ఒత్తిడి చదువుల మధ్య పిల్లలకు ఆటవిడుపు దొరకడం వలన వారి ఆనందానికి అవధుల్లేవు. నిమిషాల వ్యవధిలో ఇచ్చిన అంశాలపై వ్యాస రచన చేయడం అమోఘమని నిర్వాహకులు ఆశ్చర్యపోతున్నారు. చిన్నారుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పండుగలు ఉపయోగపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details