ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదింటికి  రూ.లక్ష పన్ను.. లబోదిబోమంటున్న యజమాని! - కాకినాడలో ఇంటి లక్ష ఇంటి పన్ను

House Tax: ఏపీలో పన్నుల బాదుడుపై ఓ వైపు ప్రజలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు అధికారులు తమ పనిని తాము కానిచ్చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంటికి నగరపాలక సంస్థ రూ.లక్షా 5 వేల పన్ను విధించింది. తీవ్ర అందోళనకు గురైన ఇంటి యజమాని.. చేపల వేటతో జీవించే తాము రూ.లక్ష ఎలా కట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇంటికి 1.05 లక్షల పన్ను
ఇంటికి 1.05 లక్షల పన్ను

By

Published : Mar 27, 2022, 4:16 PM IST

ఇంటికి 1.05 లక్షల పన్ను

House Tax: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఓ ఇంటికి.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను విధించింది నగరపాలక సంస్థ! పర్లోవపేటలో 35 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇంటికి.. గతం నుంచి ఇంటి పన్ను బకాయి ఉంది. దీంతో.. లక్షా 5 వేల రూపాయల ఇంటి పన్ను చెల్లించాలంటూ.. తాజాగా అధికారులు నోటీసు ఇవ్వడంతో ఇంటి యజమాని దిప్పాడ వెంకన్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. చేపల వేట సాగించి జీవనం సాగించే తాము.. అంత డబ్బులు ఎలా చెల్లించాలని వాపోతున్నారు. ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేశారని కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటికి అంత పన్ను వేయడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పు చేసి రూ.5 వేలు చెల్లించినా నీటి సరఫరా పునరుద్ధరించటంలేదని వాపోయారు.

ఇదీ చదవండి: Bus accident: చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details