కాకినాడలో రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాకినాడ కలెక్టర్ కార్యాలయం, సినిమా రోడ్డు, మెయిన్ రోడ్డు, దేవాలయం వీధులన్నీ నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
కాకినాడలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - kakinada rainfall latest news
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం భారీగా వర్షం కురిసింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.
![కాకినాడలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం heavy rain in kakinada since two hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8637820-360-8637820-1598952639275.jpg)
ఎడతెరిపి లేకుండా కాకినాడలో వర్షం