టీ దుకాణంలో పేలిన గ్యాస్ సిలిండర్... తృటిలో తప్పిన ప్రమాదం - కాకినాడ లేటెస్ట్ అప్డేట్స్
Gas cylinder exploded: కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
పేలిన గ్యాస్ సిలిండర్
Gas cylinder exploded: కాకినాడ ఫిషింగ్ హార్బర్ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. ఉదయం టీ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. జెట్టీ వద్ద టీ పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా... లీకయ్యి మంటలు చెలరేగాయి. వెంటనే సిలిండర్ పేలిపోయింది. దుకాణదారుడుతో పాటు టీ తాంగేందుకు వెళ్లిన వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. సిలిండర్ పేలడంతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పేశారు.