తూర్పు గోదావరి జిల్లాలో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. తెల్లవారుజామున కురిసే మంచు చూపరులను ఆకర్షిస్తున్నాయి. శీతాకాలం ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా గురువారం తెల్లవారుజామున నుంచి విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులన్నీ మంచుతెరతో కమ్మేశాయి. పొద్దు పొద్దున్నే పక్షుల రాగాలు... పువ్వులపై కురుస్తున్న బిందువులు ఆకట్టుకుంటున్నాయి. కొబ్బరి చెట్ల పై కురుస్తున్న పొగమంచు అందాలను కోనసీమ వాసులు తిలకిస్తున్నారు.
కోనసీమలో పొగ మంచు అందాలు... - తూర్పు గోదావరి జిల్లా సమాచారం
తూర్పు గోదావరి జిల్లాలో ఆకాశాన్ని కప్పేసిన పొగమంచు ప్రకృతి ప్రేమికులను... ఆకట్టుకుంటోంది. సూర్యుడు తూర్పు కొండల్లో నుంచి కొబ్బరి చెట్ల మధ్య ఉదయించడం, వికసించిన పుష్పాలపై మంచు బిందువులను ముత్యాల్లా మెరుస్తున్నాయి.
పొగ మంచు