ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వర్షాలు కురిసి వారం దాటినా.. ఇంకా ముంపులోనే..

తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మురుగు నీటిలోనే లోతట్టు ప్రాంత ప్రజలు మగ్గిపోతున్నారు. నగరపాలక సంస్థ తక్షణం చర్యలు చేపట్టి.. ముంపు నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

floods-in-east
floods-in-east

By

Published : Oct 19, 2020, 5:33 PM IST

భారీ వర్షాలు కురిసి వారం రోజులు దాటినా.. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే మగ్గుతున్నాయి. దుమ్ములపేట, డైరీ ఫాం సెంటర్, మధురా నగర్, ప్రతాప్ నగర్, ఇంద్రపాలెంతోపాటు గ్రామీణ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా మురుగు నీరు నిలిచే ఉంది. కాకినాడలో అస్థవ్యస్థ డ్రైనేజీ వ్యవస్థ, ఉప్పుటేరు నుంచి నీరు వేగంగా వెళ్లేలా చర్యలు తీసుకోకపోవడం, దుమ్ముల పేట వద్ద మడ అడవులు నరికి భూములు మెరక చేయడంతో ఈ దుస్థితి దాపురించిందని బాధిత ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్ననారు. మురుగు, బురద నీటిలో రాకపోకలు సాగించలేక జనం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. నగరపాలక సంస్థ తక్షణం చర్యలు చేపట్టి ముంపు నుంచి బయట పడేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details