కొనసీమజిల్లా రాజోలు పరిధిలో వశిష్ట గోదావరి వరద ఉద్ధృతికి లంక గ్రామాలు అల్లాడుతున్నాయి. సఖినేటిపల్లి మండలంలోని అప్పన రామునిలంక, సఖినేటిపల్లి లంక, కొత్తలంక, మలికిపురం మండలాల్లో పికల్లోతు వరకు వరద నీరు చేరింది. అధికారులు సరైన వసతులు కల్పించడం లేదని.. అనేక ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాగాని.. వసతులు కల్పించడం లేదని వాపోయారు. విలువైన సామగ్రి, పశువులను వదిలి రాలేమని స్థానికులు అంటున్నారు.
వశిష్ట గోదావరికి పెరిగిన వరద..ముంపులో ప్రధాన రహదారు..
కోనసీమ జిల్లా రాజోలు పరిధిలోని వశిష్ట గోదావరికి వరద పోటెత్తింది. సఖినేటిపల్లి మండలంలోని అప్పన రామునిలంక, సఖినేటిపల్లి లంక, కొత్తలంక, మలికిపురం మండలంలోని రామరాజులంకబాడవ గ్రామాల్లోని రహదారులపై పికల్లోతు నీరు చేరింది. ఆయా గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
వశిష్ట గోదావరికి పెరిగిన వరద