ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరద ముంపులోనే యానాం ప్రజలు,తాగునీరు, ఆహారం కోసం అవస్థలు - ఆహారం కోసం యానాం ప్రజల ఇక్కట్లు

flood effect on Yanam ఇంటి చుట్టూ నీరున్నా తాగలేరు. ఇంట్లో సరుకులున్నా వండలేరు. ఇది యానాం ప్రజల ప్రస్తుత పరిస్థితి. నెల రోజులుగా యానాం ప్రజలు వరద ముంపులోనే జీవనం సాగిస్తున్నారు. తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడుతున్నారు.

flood effect on Yanam
వరదల్లో యానాం

By

Published : Aug 20, 2022, 1:16 PM IST

flood effect on Yanam గత 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా వరదలు రావడంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం ప్రజలు నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గౌతమీ గోదావరిలో వరద నీరు మహోగ్రరూపంలో ప్రవహిస్తుండడంతో అక్కడి 1500 కుటుంబాలు నెల రోజులుగా వరద ముంపులోనే మగ్గుతున్నాయి. ఇంటి చుట్టూ నీరన్నా తాగలేరు. ఇంట్లో సరుకులు ఉన్నా వండుకోలేని పరిస్థితి. గత నెలలో వచ్చిన వరదలకు పుదుచ్చేరి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.5 వేలు తక్షణ సహాయంగా అందించింది. ఈ నెలలో వచ్చిన వరదలకు ప్రభుత్వం సహాయం అందించకపోవడంతో యానాం ప్రజాస్వచ్చంద సేవా సంస్థ ద్వారా మంచినీరు, ఆహారం అందజేస్తున్నారు.

మరో వైపు ధవలేశ్వరం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టినా... ఆ నీరంతా దిగువనున్న సముద్రంలోకి రావడంతో యానాం బాలయోగి వారధి వద్ద నేటికీ ప్రవాహం ఉద్ధృతంగానే ఉంది. శివమ్ బాత్-జెండా స్తంభాల మధ్య ఉన్న కాజ్వే నీటమునగడంతో పాఠశాల విద్యార్థులను, స్థానిక ప్రజలను అగ్నిమాపక శాఖ సిబ్బంది... ప్రైవేటు పడవల ద్వారా తరలిస్తున్నారు. అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు.

వరదల్లో యానాం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details