FIRE ACCIDENT: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది - జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
![FIRE ACCIDENT: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది fire accident at Kakinada in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13166713-1110-13166713-1632546831100.jpg)
09:49 September 25
జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలోని జీఎంఆర్ పవర్‌ప్లాంట్(gmr powerplant)లో భారీ అగ్నిప్రమాదం(fire accident at kakinada) సంభవించింది. ప్లాంట్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఎగిసిపడుతున్న మంటలను ఆదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి..
TIRUMALA: ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోపే ఖాళీ