ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రెండేళ్లలో ఈఎస్​ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం' - Union Minister santhosh gangwar ap tour

కాకినాడలో వంద పడకల ఈఎస్​ఐ ఆసుపత్రికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ శంకుస్థాపన చేశారు. స్థానిక సాంబమూర్తినగర్​లో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రమంత్రి భూమి పూజ చేశారు. రూ.110 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు ఈఎస్​ఐ ఆసుపత్రి పరిధిలోకి వస్తారని... వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఇటీవల కార్మికులకు క్యాన్సర్ అధికంగా వస్తోందని... కాకినాడ ఈఎస్​ఐ ఆసుపత్రిని క్యాన్సర్ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రులు గంగ్వార్​ను కోరారు.

ESI Hospital Construction Started in Kakinada by Union Minister
కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్

By

Published : Feb 26, 2020, 4:38 PM IST

శంకుస్థాపన అనంతరం ప్రసంగిస్తోన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details