తూర్పుగోదావరి జిల్లా సింహాద్రిపురానికి చెందిన సత్యనారాయణ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఐదేళ్ల క్రితం విద్యుత్ స్తంభంపై నుంచి కింద పడటంతో సత్యనారాయణ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. చికిత్స చేయించుకున్నా శరీర అవయవాలు పూర్తిగా చచ్చుబడిపోయాయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులే అతనికి ఆసరాగా ఉన్నారు. గతంలోనూ ఒక సారి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టరేట్‌లో విన్నవించుకున్నా... ఎలాంటి సాయం అందలేదు. అతని దీనగాధపై ఈటీవీ - ఈనాడు కథనాలు ప్రసారం చేయటంతో కొంతమంది దాతలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. తల్లిదండ్రులు కూడా తనని చూడలేని పరిస్థితి నెలకొందని.. ఇలాంటి పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతించాలని బాధితుడు మరోసారి అధికారులకు మొరపెట్టుకున్నారు. వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన అధికారులు కలెక్టర్ కార్యాలయం నుంచి పంపించేశారు.
కలెక్టర్ సారూ..కారుణ్య మరణానికి అనుమతివ్వండి! - కారుణ్య మరణానికి అనుమతి వార్తలు
విద్యుత్ స్తంభం మీద నుంచి పడిన ప్రమాదంలో శరీర అవయవాలు పూర్తిగా చచ్చుబడిన ఓ వ్యక్తి..... కారుణ్య మరణానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. కాకినాడ కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో... కారుణ్య మరణం కోరుతూ వినతిపత్రం అందించారు.
eastgodavari-resident-application-to-collector-for-death-of-compassion
ఇదీ చదవండి: రైతు భరోసా ఆర్థిక సాయం...మరో వెయ్యి పెంపు
Last Updated : Oct 15, 2019, 5:46 AM IST