ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

16 నెలల బాలుడికి.. బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం! - ggh Kakinada

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన 16 నెలల బాలుడికి ఈ నెల 3న విజయవంతంగా ఆపరేషన్‌ చేసిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. మంగళవారం డిశ్చార్జ్‌ చేశారు. తన కుమారుడి ప్రాణాలు కాపాడిన అందరికీ రుణపడి ఉంటామని ఆ బాలుడి తల్లిదండ్రులు ఉద్వేగానికి గురయ్యారు.

బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం.. బాలుడు డిశ్చార్జ్‌!
కాకినాడ జీజీహెచ్​లో బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం

By

Published : Jun 16, 2021, 7:39 AM IST

బ్లాక్ ఫంగస్ సోకిన 16 నెలల బాలుడికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి.. డిశ్చార్జ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన జానకీనందన్ అనే బాలుడికి బ్లాక్ ఫంగస్ నిర్ధరణ కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

బ్లాక్‌ఫంగస్‌ ఆపరేషన్​ విజయవంతం.. బాలుడు డిశ్చార్జ్‌!

ఆ బాలుడికి ఈనెల 3న ఆపరేషన్ చేసిన వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఇది దేశంలోనే అరుదైన చికిత్స అని వైద్యులు తెలిపారు. డాక్టర్లందరికీ రుణపడి ఉంటామని బాలుడి తల్లిదండ్రులు ఉద్వేగానికి గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details