ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాకప్‌ డెత్‌ జరగలేదు: ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు

‘లాకప్‌ డెత్‌ జరిగిందని, అక్కడేదో జరిగిపోతోందని, ఆ ఊర్లో అంతా గుమిగూడి వస్తున్నారని, మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని... వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. ఇంటర్నెట్‌ నిలిపివేయడంతో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కొందరు వీటిని చేరవేస్తున్నారు. ఇవేవీ నిజం కాదు.. వీటిని నమ్మొద్దు.. వదంతులను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు హెచ్చరించారు.

ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు
ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు

By

Published : May 31, 2022, 7:15 AM IST

అమలాపురం ఘటనపై డీఐజీ పాలరాజు విలేకరులతో మాట్లాడారు. ‘లాకప్‌ డెత్‌ జరిగిందని, అక్కడేదో జరిగిపోతోందని, ఆ ఊర్లో అంతా గుమిగూడి వస్తున్నారని, మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని... వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. ఇంటర్నెట్‌ నిలిపివేయడంతో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కొందరు వీటిని చేరవేస్తున్నారు. ఇవేవీ నిజం కాదు.. వీటిని నమ్మొద్దు.. వదంతులను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు హెచ్చరించారు. అల్లర్ల కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడు మృతి చెందాడంటూ వచ్చిన వదంతులపై స్పష్టత ఇచ్చేందుకు అమలాపురంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుతో కలిసి డీఐజీ మాట్లాడుతూ... ‘ఫోన్‌ ద్వారా వదంతులు సృష్టిస్తున్న నడిపూడికి చెందిన కేతా రమేష్‌ను అదుపులోకి తీసుకున్నాం. అదే పనిగా ఎందుకు వ్యాప్తి చేస్తున్నాడు? ఇతనికి మొన్నటి ఘటనలో పాత్ర ఉందా..? అనే కోణంలో విచారిస్తున్నాం’ అని వివరించారు. అమలాపురంలో శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రస్తుతానికి ఇంటర్నెట్‌పై మరో 24 గంటలు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. పరిస్థితిని బట్టి... వాట్సప్‌, ఫేస్‌బుక్‌ లాంటి వాటిపై ఆంక్షలు కొనసాగించి, ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చే విషయం పరిశీలిస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details