కాకినాడ ఎస్పీ కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమీక్ష నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘర్షణలపై చర్చించారు. కేసుల నమోదు, ఛార్జ్‌షీట్‌పై జిల్లా యంత్రాంగానికి సూచనలు చేశారు. మన్యంలో మావోయిస్టుల కదలికలు, జిల్లాలో బైండోవర్ కేసులపై సమీక్షించారు.
ప్రస్తుతం ఏవోబీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని డీజీపీ అన్నారు. తీరప్రాంతాల్లో ఉగ్రదాడుల ముప్పు ఉండొచ్చనే నిఘా వర్గాల హెచ్చరిక ప్రకారం... అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామవి డీజీపీ తెలిపారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు: డీజీపీ - dgp rp thakur
ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘర్షణలపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ సమీక్ష నిర్వహించారు. కేసుల నమోదు, ఛార్జ్‌షీట్‌పై జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండండి: డీజీపీ ఆర్పీ ఠాకూర్
ఇవీ చూడండి-సివిల్స్ విద్యార్థులకు 'తక్షశిల' ఉపకార వేతనం