ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యం అందక కరోనా రోగి మృతి... నిన్నటి నుంచి ఇంట్లోనే మృతదేహం!

కాకినాడలో ఓ కరోనా బాధితురాలు తన ఇంట్లోనే మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. సత్వర వైద్యం అంది ఉంటే ఆమె బతికేదని చెప్పారు.

By

Published : Jul 30, 2020, 4:57 PM IST

corona victim died in Kakinada due to lack of medical treatment
corona victim died in Kakinada due to lack of medical treatment

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. రోజుకు వెయ్యికి తగ్గకుండా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా కొన్ని చోట్ల వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా బాధితులకు సత్వర సాయం అందించటంలో విఫలమవుతున్నారు. అధికారుల అలసత్వంతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాకినాడలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా మారింది.

మృతురాలి బంధువు ఆవేదన

కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఓ మహిళ(55)కు నాలుగు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా నిర్ధరణైంది. ఆమె అస్వస్థతకు గురైందని సమాచారం ఇచ్చినా అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని మృతురాలి బంధువులు తెలిపారు. వైద్య సేవలు అందకపోవటంతో ఆమె బుధవారం మృతి చెందిందని తెలిపారు. అధికారులు బుధవారం రాత్రి వచ్చి వివరాలు తెలుసుకున్నారని... కానీ మృతదేహాన్ని తీసుకెళ్లలేదని వెల్లడించారు. ఇంట్లోనే మృతదేహం ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details