corona cases : రాష్ట్రంలో కొత్తగా 586 కరోనా కేసులు నమోదు - ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు
17:16 October 15
వైరస్ కారణంగా మరో 9 మంది మృతి
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 44,946 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా... కొత్తగా 586 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 9 మంది మరణించారు(death). రాష్ట్రంలో కరోనా నుంచి మరో 712 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,453 కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కరోనాతో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 119, తూర్పుగోదావరి జిల్లాలో 99 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
ఇదీచదవండి: dussehra : వైభవంగా దసరా వేడుకలు... ఆలయాల్లో భక్తుల రద్దీ