ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Contractors Protest on Pending Funds: రూ.43వేల కోట్ల బిల్లులు బకాయిలు..గుత్తేదారుల నిరసన - Contractors Protest on Pending Funds

Contractors Protest on Pending Funds: దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గుత్తేదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.

Contractors Protest on Pending Funds
రూ.43వేల కోట్ల బిల్లులు బకాయిలు..గుత్తేదారుల నిరసన

By

Published : Dec 14, 2021, 6:24 PM IST

Contractors Protest on Pending Funds: చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గుత్తేదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీవో జంక్షన్ ఇంద్రపాలెం లాకుల ధర్నా చౌక్ వరకు పాదయాత్ర చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కాంట్రాక్టు, నిర్మాణ పనులు చేస్తూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులతోపాటు వివిధ మార్గాల్లో తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో కొందరు చనిపోతున్నారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని తక్షణం నిధులు చెల్లించాలని గుత్తేదారులు డిమాండ్ చేశారు. ఈ నిరసన యాత్రకు వివిధ ప్రాంతాల నుంచి గుత్తేదారులు భారీగా తరలి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details