ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సర్పవరం ఫార్మా ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం - సర్పవరం ఫార్మా పరిశ్రమ ప్రమాదం

compensation
compensation

By

Published : Mar 12, 2021, 12:38 PM IST

Updated : Mar 12, 2021, 1:14 PM IST

12:32 March 12

పరిహారం ప్రకటించిన మంత్రి కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సర్పవరం ఫార్మా పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, టైకీ పరిశ్రమ రూ.40 లక్షలు పరిహారం ఇవ్వనున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం రూ.లక్ష, టైకీ పరిశ్రమ రూ.3 లక్షలు చొప్పున.. రూ.4 లక్షలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వం తరఫున ఇళ్ల స్థలం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి  చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మాధవపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి బాధితుల తరలించారు. రియాక్టర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. 

ఇదీ చదవండి:కాకినాడ: ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి‌.. ఇద్దరు కార్మికులు మృతి

Last Updated : Mar 12, 2021, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details