కాకినాడ డీఆర్సీ సమావేశంలో వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. నేతల గొడవపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ సుభాష్ చంద్రబోస్ పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకోవటంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు తనను కలవాలని సీఎం సమాచారం అందించారు. ముఖ్యమంత్రి పిలుపుతో ఇద్దరు నేతలు తాడేపల్లికి చేరుకున్నారు. వారిద్దరితో సమావేశమైన సీఎం జగన్.... సమావేశంలో రచ్చపై వివరణ తీసుకున్నారు. బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకోవద్దని ఇద్దరికీ హితవు పలికారు.
తాడేపల్లికి కాకినాడ డీఆర్సీ గొడవ..నేతలపై సీఎం ఆగ్రహం! - కాకినాడ డీఆర్సీ మీటింగ్ రగడ
కాకినాడ డీఆర్సీ సమావేశంలో వైకాపా నేతల గొడవపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ తనని కలవాలని సమాచారం ఇచ్చారు. ముఖ్యమంత్రి పిలుపుతో తాడేపల్లికి చేరిన వారిద్దరితో జగన్ సమావేశమయ్యారు. బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకోవద్దని ఇద్దరికీ హితవు పలికారు.
cm jagan
Last Updated : Nov 25, 2020, 8:36 PM IST