ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Srikanth Reddy: సోము వీర్రాజుకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సవాల్

By

Published : Oct 26, 2021, 6:25 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(chief whip srikanth reddy vs somu veerraju news) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాయచోటిలో ఇసుక దందా చేస్తున్నారంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై.. శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. సోము వీర్రాజు చేసిన ఆరోపణలు నిజమైతే.. తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు(srikanth reddy open challenges to somu veerraju news).

Srikanth Reddy
Srikanth Reddy

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు(srikanth reddy open challenges to somu veerraju news). సోము వీర్రాజు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని ఆరోపించారు.. ఆ ఆరోపణ నిజమైతే రాజీనామా చేస్తా.. కాకుంటే వీర్రాజు చేస్తారా..? అంటూ సవాల్ విసిరారు.

'హోదా, పోర్టు హామీలు అమలుచేస్తే మద్దతిస్తామన్నాం. విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయలేదని అర్థమైంది. ఇసుక వ్యాపారం చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.ఆరోపణ నిజమైతే రాజీనామా చేస్తా.. కాకుంటే వీర్రాజు చేస్తారా? కేంద్రం నిధులివ్వకున్నా పోలవరం పూర్తి చేసేందుకు యత్నిస్తున్నాం. పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్‌ బాధ్యత కేంద్రానిది కాదా? విభజన చట్టం హామీల అమలుకు భాజపా నేతలు ప్రయత్నించాలి' - శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

సోము వీర్రాజు ఏమన్నారంటే..

కడప జిల్లా(kadapa district) బద్వేలు ఉప ఎన్నిక(Badvel bypoll)కు కేంద్ర పారా మిలటరీ దళాలను కేటాయించడాన్ని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) విమర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి(govt chief whip Srikanth Reddy).. తట్టుకోలేక భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఇవాళ ఉదయం కడపలో మండిపడ్డారు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి కనుసన్నల్లో ఇసుక దందా యథేచ్చగా సాగుతోందని.. కొన్ని ఫొటోలను మీడియాకు చూపించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం పోర్టు ఇస్తే బద్వేలు పోటీ నుంచి తప్పుకుంటామని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసరడంపై సోము వీర్రాజు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో.. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని శ్రీకాంత్ రెడ్డికి (Somu Veerraju challenge to srikanth reddy)సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్​పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని.. విభజన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. బద్వేలు నియోజక వర్గంలో వైకాపా నేతల భూ అక్రమణలతో ప్రజలు విసిగిపోయారని.. బాధితులకు భాజపా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి స్పందిస్తూ.. తనపై వీర్రాజు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి:Somu Veerraju: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి సోము వీర్రాజు సవాల్‌..ఏంటంటే..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details