Chandrababu tour: తెదేపా అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలో భాగంగా నేడు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు. తాళ్లరేవులో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తారు.
Chandrababu Tour: నేడు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన - తెదేపా అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన
Chandrababu tour: జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు కొనసాగుతున్నాయి. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొంటున్న తెదేపా అధినేత.. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. నేడు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. తాళ్లరేవులో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొంటారు.
చంద్రబాబు జిల్లాల పర్యటన
గురువారం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నివాసానికి చంద్రబాబు వెళ్లారు. బండారు అప్పలనాయుడు దంపతులను ఆశీర్వదించారు.. అలాగే బండారు సత్యనారాయణ మూర్తి అల్లుడు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కుమార్తెను చంద్రబాబు ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించారు. బండారు సత్యనారాయణ మూర్తి.. వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు ముచ్చటించారు. గ్రామస్తులతో మాట్లాడారు.
ఇదీ చదవండి: అందుకే జగన్ పాదయాత్ర.. ఆయన కన్ను పడితే ఖతమే : చంద్రబాబు