నాలుగు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న భవన నిర్మాణ కార్మికులను... పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు దీక్ష చేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షను రాత్రి 10:30 గంటలకు కాకినాడ పోలీసులు భగ్నం చేశారు. అరెస్టయిన భవన నిర్మాణ కార్మికులను... కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాకినాడలో భవననిర్మాణ కార్మికుల అరెస్టు - labour arrest in kakinada
కాకినాడ కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్న భవననిర్మాణ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘాల నేతలు, కార్మికులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఇసుక లభ్యత, మృతుల కుటుంబాలకు పరిహారం కోరుతూ... 4 రోజులుగా సంఘాల నేతలు, కార్మికులు దీక్ష చేశారు.
![కాకినాడలో భవననిర్మాణ కార్మికుల అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5078254-30-5078254-1573841352878.jpg)
కాకినాడలో భవననిర్మాణ కార్మికుల అరెస్టు
TAGGED:
labour arrest in kakinada