ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాలంటీర్లతో ఎన్నికల ప్రచారమా? - bjp protest at kakinada

కాకినాడ కార్పొరేషన్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న డివిజన్లలో.. అధికార పార్టీ తరఫున వార్డు వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారని భాజపా నాయకులు బుధవారం నిరసన చేపట్టారు.

bjp protest at kakinada
bjp protest at kakinada

By

Published : Nov 11, 2021, 9:07 AM IST

కాకినాడ కార్పొరేషన్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్న డివిజన్లలో వార్డు వాలంటీర్లు అధికార పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని భాజపా నాయకులు బుధవారం ఆందోళనకు దిగారు. 9వ డివిజన్‌లో ఓ వాలంటీరును అడ్డుకోగా.. భాజపా నేతలకు, వైకాపా నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం భాజపా నాయకులు ఆర్వో కార్యాలయం వద్ద భైఠాయించారు. ఆ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి యెనిమిరెడ్డి మాలకొండయ్యరెడ్డి మాట్లాడుతూ.. వైకాపా నాయకులు వాలంటీర్లతో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయకుంటే పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది అత్యంత దుర్మార్గమన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీరును సస్పెండ్‌ చేయాలన్నారు. కలెక్టర్‌, ఎస్పీలకు సమాచారం ఇచ్చినా స్పందించలేదన్నారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి.. భాజపా నాయకులను వెళ్లిపోవాలని చెప్పడంతో.. మరోసారి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇదీ చదవండి:

Ap Genco: ఆర్థిక గండం గట్టెక్కడానికి.. అన్ని వేల కోట్లు కావాలా?!

ABOUT THE AUTHOR

...view details