Suicide: కాకినాడ జిల్లాలో అంతర్బాగంగా ఉన్న కేంద్రపాలిత యానాంలో యూకో బ్యాంక్ మేనేజర్ సాయి రత్న శ్రీకాంత్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ నగర్లో భార్య, ఇద్దరు కుమార్తెలతో అద్దె భవనంలో నివాసం ఉంటున్న శ్రీకాంత్.. తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. యానాం పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా.. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు.
Suicide: ఇచ్చిన రుణాలే ప్రాణాలు తీశాయి - కాకినాడ జిల్లాలో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
Suicide: బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దాంతో తానే అప్పులు చేసి ఖాతాదారుల రుణాలు చెల్లించిన ఓ బ్యాంకు మేనేజరు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యానాంలో జరిగింది. అసలేం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆర్థికపరమైన ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నామన్నారు. గతంలో మచిలీపట్నం బ్రాంచ్‌లో మూడేళ్లపాటు మేనేజర్‌గా పనిచేసిన సమయంలో చేపల చెరువుల నిర్వహణకు బ్యాంకు తరఫున లోను మంజూరు చేయగా.. లబ్ధిదారులు సక్రమంగా వాయిదాలు చెల్లించకపోవడంతో.. పైఅధికారులు ఒత్తిడి మేరకు రూ.50 లక్షలు చెల్లించాడని.. మూడు నెలల క్రితం యానాం బ్రాంచ్‌కు బదిలీ చేశారని... ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరో రూ.35 లక్షలు లోన్ ద్వారా తీసుకొని చెల్లించారని కుటుంబ సభ్యులు చెప్పినట్టు తెలిపారు. అయినా పైఅధికారులు ఒత్తిడి పెరగడంతో తీవ్రమైన మానసిక శోభకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: