ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాకినాడ జడ్పీ సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం

Kakinada zp meeting కాకినాడ జిల్లాపరిషత్ సమావేశం వాడీవేడిగా జరిగింది. జడ్పీటీసీలకు ఛాంబర్లు కేటాయింపుపై మంత్రి వేణు, వైకాపా ఎమ్మెల్యే చంటిబాబు మధ్య వాదన సాగింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పని చేస్తున్నామన్న మంత్రి వేణుగోపాలకృష్ణ తెలపగా తప్పులు కప్పిపుచ్చుకోవడం సరికాదంటూ చంటిబాబు ఘాటుగా స్పందించారు.

Kakinada zp meeting
కాకినాడ జిల్లాపరిషత్ సమావేశం

By

Published : Aug 16, 2022, 5:56 PM IST

Kakinada zp meeting: కాకినాడ జడ్పీ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే చంటిబాబు మధ్య వాగ్వాదం జరిగింది. జడ్పీటీసీలకు ఛాంబర్లు కేటాయించాలని జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు డిమాండ్​ చేయగా.. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పని చేస్తున్నామని మంత్రి వేణుగోపాలకృష్ణ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వంలో ఉండి ఇలా మాట్లాడటం ఏంటని ఎమ్మెల్యేను మంత్రి ప్రశ్నించారు. దీంతో గట్టిగా మాట్లాడుతున్నారేంటని మంత్రిని చిట్టిబాబు నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కాకినాడ జిల్లాపరిషత్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details