ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ameerkhan in kakinada: కాకినాడలో ఆమిర్​ఖాన్ - కాకినాడలో ఆమీర్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కాకినాడకు విచ్చేశారు. సముద్రతీర ప్రాంతంలో రెండు రోజుల పాటు జరగనున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు.

vameerkhan in kakinada
ameerkhan in kakinada

By

Published : Aug 13, 2021, 7:33 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. లాల్ సింగ్ చద్దా షూటింగ్ నిమిత్తం రెండు రోజుల పాటు జిల్లాలో ఆయనపై పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. శుక్రవారం అమలాపురంలో, శనివారం కాకినాడ బీచ్​లో చిత్రీకరణ జరగనుంది. ఆయన కాకినాడలోని ఓ హోటల్​లో బస చేశారు.

కొవిడ్​ నేపథ్యంలో ఆమిర్​ను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. ఆయన బస చేసిన హోటల్​కు ప్రైవేట్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించారు.

ఇదీ చదవండి:ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్​

ABOUT THE AUTHOR

...view details