ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాకినాడలో కలకలం... ఏడేళ్ల బాలిక అపహరణ

కాకినాడలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్​కు గురైంది. పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని... గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని తెలుస్తోంది. పినతల్లే తీసుకెళ్లి ఉంటుందని... పాప నాయనమ్మ అనుమానం వ్యక్తం చేస్తోంది.

kidnap

By

Published : Nov 23, 2019, 11:28 PM IST

కాకినాడలో కలకలం... ఏడేళ్ల బాలిక అపహరణ

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఏడేళ్ల బాలిక అపహరణ కలకలం రేపుతోంది. దీప్తిశ్రీ ఇసాని జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఈ పాప తల్లి మూడేళ్ల క్రితం చనిపోగా... తండ్రి సూరాడ సత్యశ్యాంప్రసాద్ కుమార్ మరో వివాహం చేసుకున్నారు. భార్య శాంతికుమారి, కుమారుడుతో కలసి సంజయ్​నగర్​లో నివాసం ఉంటున్నారు. దీప్తిశ్రీ తూరంగి పగడాలపేటలో మేనత్త వద్ద ఉంటోంది.

రోజూ మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తిశ్రీ... మధ్యాహ్న భోజన అనంతరం బడి ఆవరణలో ఆడుకుంటుంంది. అప్పుడు... దీప్తిశ్రీని గుర్తుతెలియని మహిళ, మరోవ్యక్తి అపహరించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బాలిక తండ్రి వన్​టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తల్లి శాంతికుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే... సవతి తల్లి శాంతికుమారే... తన మనవరాలు దీప్తిశ్రీని చంపేసిందని... పాప నానమ్మ బేబి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details