ఈ మధ్యనే.. దిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడు ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రార్థనల్లో పాల్గొన్నాడు. జిల్లాలోని వాకపల్లి, శరభవరం, ఉత్తరకంచి, ప్రత్తిపాడు గ్రామాలకు చెందిన 40 మంది ముస్లింలు ఈ ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ నిమిత్తం నలభై మందిని కాకినాడ జేఎన్టీయూకు అధికారులు తరలించారు. అతను ప్రత్యక్షంగా కలిసిన వ్యక్తిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారిని క్వారంటైన్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక్క వ్యక్తి కారణంగా.. క్వారంటైన్‌కు 40 మంది - క్వారంటైన్ న్యూస్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిన్న కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తి ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో వారం రోజుల కిందట ప్రార్థనలో పాల్గొన్నాడు. 40 మంది ముస్లింలు ఈ ప్రార్థనలకు హాజరైనట్లు తెలుస్తోంది.
ఒక్క వ్యక్తి కారణంగా.. క్వారంటైన్‌కు 40 మంది
Last Updated : Mar 31, 2020, 4:04 PM IST