ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm

.

By

Published : Mar 19, 2021, 3:00 PM IST

3pm_Topnews
ప్రధాన వార్తలు @ 3pm

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూత్ర తమ వాదనలు వినిపించారు. సిద్దార్థ్‌ లూత్ర సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది. నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు తమ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు..ఆర్పేందుకు యత్నం

శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. ఎండలు పెరుగుతుండటంతో.. అటవీ ప్రాంతంలో మంటలు రాజుకుంటున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పాఠశాలలో పురుగులు.. విద్యార్థుల అవస్థలు

అనంతపురం జిల్లా పెనుకొండలోని వెంకటరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో వసతులు కరువయ్యాయి. దానికితోడు పాఠశాల ఆవరణమంతా చెత్త పేరుకుపోవటంతో.. పురుగులు చేరుతున్నాయి. దీంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఒంగోలులో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

ఒంగోలులో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లూరు సమీపంలో రైలు కింద పడి మరణించారు. మృతులు చీమకుర్తివాసులుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రేమజంట పాలిటెక్నిక్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'విజయన్​ సీటు'కు ఎందుకంత క్రేజ్​?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయన్​ బరిలో నిలుస్తున్న ధర్మదామ్​ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. విజయన్​కు పోటీగా అభ్యర్థులను నిలపటంలో విపక్షాలు ఇబ్బందులు ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే.. 2017లో సంచలనం సృష్టించిన వలయార్​ హత్యాచారం కేసులో బాలికల తల్లి పోటీలో నిలవటం మరో ఎత్తు. మరి అలాంటి నియోజకవర్గంలో గెలుపెవరిది? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అసెంబ్లీ తీర్మానాలు చేస్తే తప్పేంటి?'

కేంద్రం అమలు చేసే చట్టాలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. దీన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అసెంబ్లీ ఎందుకు తన అభిప్రాయాన్ని వ్యక్తపరచకూడదని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్​ను ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రైతుల అంశంపై మోదీతో మాట్లాడండి'

రైతు నిరసనలపై భారత్​ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికాలో ఇద్దరు సెనేటర్లు ఆ దేశ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. కర్షకుల విషయంపై బైడన్​ ప్రభుత్వం ప్రధాని మోదీతో మాట్లాడాలని కోరారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆధార్‌, పాన్​ లింక్​ లేకుంటే రూ.10వేలు ఫైన్!

మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను.. మీ ఆధార్‌తో అనుసంధానం చేశారా? ఇప్పటికీ చేయకపోతే వెంటనే త్వరపడండి. మార్చి 31 లోగా ఈ పని పూర్తి చేయకపోతే రూ.10వేల జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'రోహిత్ అలా చేయమన్నాడు.. ఫలితం దక్కింది'

ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. కీలక సమయంలో వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టుపై ఒత్తిడి పెంచాడు శార్దూల్ ఠాకూర్. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఇతడు.. రోహిత్ సూచనలు పనికొచ్చాయని తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'జాతిరత్నాలు' హీరోయిన్​కు వరుస ఆఫర్లు!

'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టి పాత్రతో కుర్రకారు మదిలో పత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఫరియా అబ్దుల్లా. నటించిన తొలి చిత్రమే సూపర్​హిట్​ అవ్వడం వల్ల టాలీవుడ్​లో ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details