MLA Rachamallu challenge: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో రోడ్డు విస్తరణ పనులు.. ఉద్రిక్తతకు దారి తీశాయి. ప్రొద్దుటూరులోని గవిని కూడలి నుంచి ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం.. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి భూమిపూజ చేశారు. ఆ మార్గంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలు, కట్టడాలను అధికారులు జేసీబీల సహాయంతో కూల్చివేశారు. దీనిపై తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కొలతలు వేయకుండానే నిర్మాణాలను ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. విస్తరణ పనులు అడ్డుకునేందుకు వెళ్తున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ సహా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ప్రొద్దుటూరులో తెదేపా గెలిస్తే రాజకీయాల్లో ఉండను.. వైకాపా ఎమ్మెల్యే సవాల్ - వైఎస్సార్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
MLA Rachamallu challenge: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెదేపా నేతలకు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను బ్రతికి ఉండగా ప్రొద్దుటూరులో తెదేపా గెలవదని... గెలిస్తే జీవితంలో రాజకీయాల్లో ఉండనని సవాల్ చేశారు. అసలేం జరిగిందంటే..?
MLA Rachamallu challenge: నిత్యం ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పట్టించుకోకుండా... తన ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే ఎమ్మెల్యే రాచమల్లు.. ట్రాఫిక్ లేని గవిని కూడలి వద్ద రోడ్డు విసర్తరణ పనులు చేయించడం బాధాకరమని తెదేపా నాయకులు ముక్తియార్ ఆరోపించారు. రోడ్డు వెడల్పు పనుల్లో జామియా మసీదు గదులు తొలగిపోతున్నాయని మండిపడ్డారు.
MLA Rachamallu challenge: దీనిపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రతికి ఉండగా ప్రొద్దుటూరులో తెదేపా గెలవదని... గెలిస్తే జీవితంలో రాజకీయాల్లో ఉండనని సవాల్ చేశారు.
ఇదీ చదవండి: Nadendla: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలా?: నాదెండ్ల