ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆప్కోలో భారీ అక్రమాలు.. విచారణకు ప్రభుత్వ సలహాదారు అడ్డు.. డీఎల్ సంచలన ఆరోపణలు

ఆప్కోలో జరిగిన అక్రమాలపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈడీ చేత విచారణ చేయించాలన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కొన్ని ఆధారాలను ఆయన బహిర్గతం చేశారు.

DL RAVINDRA REDDY
DL RAVINDRA REDDY

By

Published : Oct 28, 2021, 7:27 PM IST

ఆప్కోలో రూ.1000 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంలో విచారణకు ప్రభుత్వంలోని ఒక సలహాదారుడు అడ్డుపడుతున్నట్లు తనకు తెలిసిందని.. మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఐడీ విచార‌ణ జ‌రిగి న‌గ‌దు, బంగారంతోపాటు ర‌ద్దుచేసిన పాత నోట్ల‌ను కూడా సీజ్ చేసినప్పటికీ.. ఆప్కో మాజీ చైర్మ‌న్ గుజ్జ‌ల శ్రీ‌నుపై ఎందుకు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేదో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఈడీ చేత విచారణ చేయించాల‌ని కోరారు.

ఆప్కో అక్రమాలపై చర్యలు తీసుకోనివ్వని ప్రభుత్వ సలహాదారు..!

గత 10 ఏళ్లుగా చేనేతలు మ‌గ్గంపై నేసిన వస్త్రాలను ఆప్కో కొన‌డంలేద‌ని.. యంత్రాల‌పైన త‌యారైన వస్త్రాలనే కొనుగోలు చేసి, మ‌గ్గంపై నేసిన వ‌స్త్రాల‌ను కొనుగోలు చేశామని చూపుతున్నట్లు డీఎల్ ఆధారాల‌ు చూపించారు. కడప జిల్లాలోని 193 సహకార సొసైటీలలో ఒక్కచోట కూడా మగ్గాలు లేవన్న ఆయన.. ఈ సొసైటీల మాటున వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించి.. అవినీతిని బయట పెట్టాలని విజ్ఞప్తి చేశారు. చేనేత సొసైటీల‌లో ఆడిట్ లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ సొసైటీల నుంచి లావాదేవీలు జ‌ర‌ప‌కూడ‌ద‌ని.. అయినప్పటికీ, కొనుగోళ్లు జరపడం వెనుక భారీ అవినీతి జ‌రిగింద‌ని డీఎల్ అరోపించారు.

ఇదీ చదవండి:

PENNA RIVER : పెన్నాకు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details