కడప జిల్లాలో వైకాపా నేత మహబూబ్ బాషా.. ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. రవీంద్రనగర్ కు చెందిన రామలక్ష్మి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా తనకు ఎదురుగా వచ్చిందన్న కారణంతో 'నాకే అడ్డుగా వస్తావా అంటూ...' మహిళను కొట్టడం మొదలు పెట్టాడు. కాలితో తన్ని.. జుట్టు పట్టుకుని కిందపడేశాడు. స్థానికులు అడ్డుకున్నా వదల్లేదు. అదేపనిగా కొడుతూనే ఉన్నాడు. అందరూ చూస్తుండగా పట్టపగలే ఈ దాడికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఈ దాడిని తమ మొబైల్లో చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహబూబ్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.
మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన వైకాపా నేత - మహిళపై విచక్షణారహితంగా వైకాపా నేత దాడి
కడప జిల్లాలో వైకాపా నేత మహబూబ్ బాషా రోడ్డు మీద వెళుతున్న ఓ మహిళపై దాడి చేశాడు. తనకు ఎదురుగా వచ్చిందన్న కారణంతో విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగి కింద పడేశాడు. స్థానికులు అడ్డుకున్నా వినలేదు.
ycp attacమహిళపై విచక్షణారహితంగా దాడిk
Last Updated : Jun 12, 2020, 3:28 PM IST