జలశక్తి అభియాన్ అమలులో.. మనమే టాప్! - కడప జిల్లాకు మొదటి స్థానం
కడప జిల్లా.. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పథకంలో జాతీయస్థాయి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
kadapa district
కేంద్రం ప్రకటించిన జల్‌శక్తి అభియాన్‌లో మన రాష్ట్రానికి చెందిన కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో 82.16 పాయింట్లతో కడప అగ్రస్థానం సొంతం చేసుకుంది. రెండో స్థానంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన బనస్ కాంత జిల్లా, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగారెడ్డి జిల్లా నిలిచాయి. నీటి సంరక్షణతో పాటు.. తరుగుతున్న భూగర్భ జలాలు కాపాడుకునే లక్ష్యంతో కేంద్రం జల్‌శక్తి అభియాన్‌ను ప్రారంభించింది.