ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అయ్యవారిపల్లె సర్పంచి ఇంటిపై వైకాపా నాయకుల దాడి..ఆరుగురికి గాయాలు - సర్పంచి నివాసంపై దాడి చేసిన వైకాపా నాయకులు

YCP leaders attacked: చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతి సర్పంచి నివాసంపై వైకాపా నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు.

YCP leaders attacked
సర్పంచిపై వైకాపా నాయకుల దాడి

By

Published : Mar 10, 2022, 1:39 PM IST

Updated : Mar 10, 2022, 2:26 PM IST

YCP leaders attacked: కడప జిల్లా చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైకాపా నాయకులు దాడి చేశారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు.

సర్పంచిపై వైకాపా నాయకుల దాడి

గ్రామానికి మంజూరైన సిమెంట్‌ పనుల విషయంలో పంచాయతీ తీర్మానంపై సంతకాలు చేయలేదనే కారణంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసినట్లు సర్పంచి వర్గం ఆరోపించింది. గాయపడిన కుటుంబసభ్యులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Mar 10, 2022, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details