ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మత్తు ఇంజక్షన్​ వేసుకుని యువతి ఆత్మహత్య..కారణం ఏంటంటే..! - కడపలో యువతి ఆత్మహత్య

మత్తు సూదులు వేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడపలో జరిగింది. కాగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.

women suicide in kadapa
women suicide in kadapa

By

Published : Aug 25, 2021, 7:28 AM IST

కడప నగరంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్​లో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి మత్తు ఇంజక్షన్​ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఓ యువతి కడపలోని మహిళా వసతి గృహంలో ఉంటూ ఓ నర్సింగ్ హోమ్ స్టాఫ్ నర్స్​గా పనిచేస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ బుడ్డాయిపల్లెలో ఓ గది అద్దెకు తీసుకొని మరో నర్సింగ్ హోమ్​లో పని చేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోమవారం రాత్రి ఆ యువతి బుడ్డాయపల్లెలో ఉన్న అనిల్ కుమార్ గదికి వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ యువతి మిద్దెపైకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న మత్తు ఇంజక్షన్​ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:గుత్తి సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి

ABOUT THE AUTHOR

...view details