ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా!? - wife murders husband

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను... ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. ఈ సంఘటన కడప నగరంలోని వైఎస్సార్ కాలనీలో చోటుచేసుకుంది.

భర్తను చంపిన భార్య

By

Published : Jul 14, 2019, 10:13 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను... ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన కడప చిన్నచౌక్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కడప నగరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన లక్ష్మి-వెంకటరమణలకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వెంకటరమణ షరబత్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మి ఏడాది నుంచి ఓ ఆటో డ్రైవర్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తను చంపిన భార్య

ABOUT THE AUTHOR

...view details