Wife killed her husband: భర్త మద్యం తాగొచ్చి వేధిస్తుంటే ఆ వేధింపులు భరించలేక భార్య విరక్తి చెంది రోకలి బండతో తలపై కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కడప శ్రీకృష్ణదేవరాయ కాలనీలో చోటుచేసుకుంది. కడపలోని శ్రీకృష్ణదేవరాయ కాలనీకి చెందిన సుబ్బనర్సయ్యకు సుజాతకు 20 ఏళ్ల క్రిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుబ్బ నరసయ్య ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
Wife killed her husband: మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను అలా... - కడపలో భర్తను హత్య చేసిన భార్య
Wife killed her husband: మహమ్మారి మద్యం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోంది. తాగి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాదు... కుటుంబ సభ్యుల బతుకులను చిద్రం చేస్తున్నారు కొందరు. మద్యానికి బానిసై ప్రాణాలు తీయడం, తీసుకోవడం, ఎదుటివారి చేతిలో హత్యకు గురికావడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కడప జిల్లాలో ఇదే ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ భార్య భర్త ప్రాణాన్ని బలికొంది. అసలేం జరిగిందంటే..?
భర్తును హత్య చేసిన భార్య
ఇటీవల కాలంలో మద్యానికి బానిసై తాగి వచ్చి భార్యను వేధింపులకు గురిచేస్తుండేవాడు. పలువురు పెద్దల సమక్షంలో గతంలో పంచాయితీ చేసినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. అర్ధరాత్రి సుబ్బనర్సయ్య మద్యం తాగించి భార్యను వేధిస్తుంటే... వేధింపులు భరించలేక రోకలిబండ తీసుకొని భర్త తలపై బలంగా కొట్టడంతో తల పగిలి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: