Under 19 Vice Captain Rashid: టీం ఇండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని అండర్ 19 వైస్ కెప్టెన్ రషీద్ అన్నారు. ఆటలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రికెట్లో రాణించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
కడపలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 13వ వార్షిక క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార‌్థులతో పాటు ఉపాధ్యాయులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి రషీద్ బహుమతులు ప్రదానం చేశారు.