కడప శంకరాపురం ప్రాంతానికి చెందిన వంశీకృష్ణకు ఫేస్బుక్ ద్వారా హైదరాబాద్కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని వంశీకృష్ణ తన తల్లిదండ్రులకు తెలిపాడు. వీరి ప్రేమ విషయాన్ని వారు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
SUICIDE : విషాదం... వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య - kadapa latest news
కడప నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదన్న కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో అనుమానాస్పద స్థితిలో చీరకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు.
![SUICIDE : విషాదం... వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13096669-500-13096669-1631903658011.jpg)
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య
కడప శివారులోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం... ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.